రాష్ట్రంలో 51 కరువు మండలాలు ఉన్నట్టు అధికారులు తాజాగా గుర్తించారు. తీవ్ర ఎండలు వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కరువు మండలాలను గుర్తించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆయా మండలాల్లో పర్యటించిన అధికారులు కరువు పరిస్థితులను అధ్యాయనం చేశారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 51 మండలాల్లో కరువు కరువు ఉన్నట్లు అంచనా వేశారు సాంకేతికత ఆధారంగా కరువు మండలాలపై కలెక్టర్లు నివేదికలు తయారు చేశారు. అనంతరం ప్రభుత్వానికి అందజేశారు దీంతో కరువు మండలాలపై ప్రభుత్వం త్వరలోనే జాబితాను విడుదల చేయనుంది.
ఈ ఏడాది రబీలో లోటు వర్షపాతం నమోదు అయింది. సరైన సమయంలో వర్షాలు పడలేదు. పంటల దిగుబడులు సైతం చాలా తగ్గిపోయాయి. రబీ సీజన్ ముగిసిన నేపథ్యంలో కరువు పరిస్తితులపై అధికారులను ప్రభుత్వం నివేదికలు కోరింది. పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి, వర్షపాతం నమోదు, భూమిలో తేమశాతం, భూగర్భజలాల పరిస్థితి వంటి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగా కరువు మండలాలను అధికారులు ఎంపిక చేశారు.