కాంగ్రెస్ ప్రభుత్వం పై పొన్నాల లక్ష్మయ్య ఫైర్

-

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. రైతుల పంటలు ఎండిపోతుంటే.. అసలు ఏమాత్రం పట్టింపులేనట్టే ప్రబుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్లు అన్నీ నింపితే తొమ్మిది టీఎంసీల నీళ్లు ఉండేవి. కానీ ప్రభుత్వం అలాంటి పనులు చేయడం లేదన్నారు.

ఏమైనా బీఆర్ఎస్ పై బురదజల్లడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటినా ఇంకా పరిపాలన పై కాంగ్రెస్ నేతల్లో ఎవ్వరికీ అవగాహన రావడం లేదని అన్నారు. ఇచ్చిన గ్యారంటీలన్నీ ఆటకెక్కించారని తెలిపారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వడం లేదు. స్కూటీలు ఇవ్వడం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు. రైతు భరోసా కూడా సరిగ్గా అమలు చేయడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version