ఎన్నికలు అంటేనే యుద్ధాలు జరుగుతాయి.ఎన్నికలంటే రౌడీలూ,గూండాలూ కలిసి పోలింగు స్టేషన్ల దగ్గర వివాదాలను సృష్టిస్తారు. కానీ ఓ అమ్మాయి రాక కారణంగా మాత్రం అక్కడ వాతావరణంలో విపరీతం అయిన ఆకర్షణ మంత్రం ఒకటి వినిపించింది. అందం అమ్మాయయితే నీలా ఉందా అనిపిస్తుందే అన్న విధంగా ఆ పాట పాడుకునే విధంగా మరో సారి ఆ పాటకు ఆ మాటకు ఆ అమ్మాయిని జత చేసే విధంగా జగమంతా వినిపించే విధంగా ఉన్నదా సందర్భం. అందం కారణంగా యుద్ధాలేవీ ఈ సారి జరగలేదు కానీ బ్యూటీ స్పీక్స్ అనే మాటకు ముగ్ధత మాత్రం ఆమె వల్లే సాధ్యం అని మాత్రం సుస్పష్టంగా చెప్పవచ్చు.
మళ్లీ ఎన్నికలు అనే రాసే కన్నా మళ్లీ అందమయిన అమ్మాయిలు ఉన్న ఎన్నికలు ఇవి అని రాయడం బాగుంటుంది.ఉత్తరప్రదేశ్ లో అందమయిన అమ్మాయిలు చాలా మంది ఎన్నికల వేళ హల్చల్ చేశారు. వారిందరికీ ఉన్న కామన్ క్వాలిటీ అందం. ఆ అందాన్ని దాటి మరో అందం వచ్చి వారి ఎదురుగా వచ్చి పలకరించి వెళ్తే ఎలా ఉంటుంది.
ఆ అందాన్ని దాటి మరో అందం సుమనోహర రూపం వచ్చి వెళ్తే ఎలా ఉంటుంది.అవును ! అలాంటి పరిణామమే యూపీ లో జరిగింది. ఊహూ! యూపీ ఎన్నికల పోల్ సీన్ లో ఇవాళ నెలకొంది.నాల్గో విడత ఎన్నికలకు సంబంధించి విధి నిర్వహణకు వచ్చిన అందాల అధికారి రాణి ద్వివేది కెమెరా కన్నును ఆకర్షించారు. గతంలోనూ ఈమె తన అందంతో కెమెరా కళ్లను కట్టిపడేసిన దాఖలాలు ఉన్నాయి.
యూపీ ఎన్నికల్లో అందాల మాజీ హీరోయిన్లకు,గ్లామర్ ప్రపంచానికి చెందిన ఇతర సుందరీమణులకు దక్కని అదృష్టం ఆమెకే దక్కింది.ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పీడబ్ల్యూడీ విభాగంలో ఈ అధికారి ఫొటోలు గత ఎన్నికల్లోనూ వైరల్ అయ్యాయి.ఇక్కడి దేవరియా జిల్లా కు చెందిన ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.గ
తంలోనూ ఆమెకు తెలియకుండానే పేరు వస్తే ఈ సారి తెలిసే చాలా మంది పోలీసు అధికారులు, కేంద్ర భద్రతా బలగాలు ఆమె చుట్టూ చేరి ఒన్ సెల్ఫీ ప్లీజ్ అంటూ ఎగబడ్డారు. ఎలక్టోరల్ పోలింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించేందుకు ఇక్కడికి వచ్చిన ఆమె స్లీవ్ లెస్ టాప్,లేత గోధుమ రంగు ప్యాంట్ , చలువ కళ్లద్దాలు ధరించి ఇక్కడి వారిని అమితంగా ఆకర్షించారు.