సాధారణంగా అడవుల్లో ఉండే సింహాలు అక్కడి సాధు జంతువులను వేటాడుతుంటాయి. వాటి వెంట పడి వేటాడి చంపి తింటాయి. అయితే సింహాలు ఇతర జంతువుల వెనక పడడడం ఇప్పటి వరకు చూశాం. కానీ ఎప్పుడైనా సింహాల వెనుకే వేరే జంతువులు వెంట పడడం చూశారా..? లేదు కదా.. అయితే తాజాగా ఆ సంఘటన చోటు చేసుకుంది. మీరే వీక్షించండి.
కొన్ని గేదెలను రెండు సింహాలు తరిమాయి. వాటి వెంట పడి బెదిరించాయి. దీంతో గేదెలు పారిపోయాయి. అయితే వాటిలో కొన్ని గేదెలు మళ్లీ ఒక్కటిగా కలిసి వచ్చి ఆ రెండు సింహాలను వెంబడించాయి. దీంతో ఆ సింహాలు అక్కడి నుంచి జారుకున్నాయి. అదీ వీడియోలో చిత్రీకరించబడింది. అయితే దీన్ని ఎక్కడ చిత్రీకరించారో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద షేర్ చేయగా.. ఇప్పటికే దీన్ని అనేక మంది చూశారు. లైక్‌లు కొట్టారు. చాలా మంది దీన్ని షేర్ చేస్తున్నారు.
అయితే వీడియోపై నెటిజన్లు చాలా మంది స్పందిస్తున్నారు. గేదెలు అలా కలసికట్టుగా ఉండడం వల్లే బలమైన ఆ రెండు సింహాలను ఎదిరించాయని, అందువల్ల జనాలు కూడా అలా కలసి కట్టుగా ఉండాలని అంటున్నారు.