ఎన్టీఆర్, హరికృష్ణల జీవితాలను చంద్రబాబు కూల్చేశారు : బుగ్గన

-

ఎన్టీఆర్, హరికృష్ణల జీవితాలను చంద్రబాబు కూల్చేశారని… మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. నేను అప్పుల మంత్రినా..? అని ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి అప్పులు చేయకుండా.. హోం మంత్రి చేస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బుగ్గన. ఒక్క ఏపీ రాష్ట్రమే అప్పులు చేస్తోందా అన్నారు. నేనే అప్పుల మంత్రైతే.. యనమల పెద్ద అప్పుల మంత్రా..? అని ప్రశ్నించారు.


ఆర్థిక మంత్రిగా నేను అప్పులు చేస్తాను.. మరి పాల వ్యాపారం చేసుకుంటోన్న చంద్రబాబును పాల నాయుడనలా..? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రౌడీ షీటర్ మాదిరి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. నా ఇంటిని.. నా జీవితాన్ని కూలుస్తానని చంద్రబాబు అంటారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత మామ, బావ మరిది జీవితాలను చంద్రబాబు కూల్చారని ఆరోపించారు.

తాను వందేళ్ల క్రితం కట్టిన ఇంటిలో ఉంటున్నానని.. నా ఊళ్లోనే ఉంటున్నాను.. నారా వారి పల్లెలో చంద్రబాబు ఎక్కడున్నారు..? అని ప్రశ్నించారు. ఏడాదికోసారి తల్లిని చూడడానికి చంద్రబాబు వెళ్లేవారని .. అలా వెళ్లినప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకునేవారని ఆరోపించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంది, దేశం ఇబ్బందుల్లో ఉంది, ప్రపంచం ఇబ్బందుల్లో ఉంది..ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తున్నామన్నారు బుగ్గన.

Read more RELATED
Recommended to you

Exit mobile version