ఏపీకి కేంద్రం రూ.41,338 కోట్లు కేటాయించిందని తెలిపారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలను మండలిలో ప్రస్తావించారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన. శాసనమండలిలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. 2023-24 వార్షిక బడ్జెట్ లో భాగంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.41,338 కోట్ల కేటాయింపులు చేశారని వివరించారు.
15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన ప్రకారం , స్థానిక సంస్థలకు సంబంధించి రూ.8,077 కోట్లు కేటాయింపులు చేశారని.. కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వారా ఏపీకి రావలసిన నిధులు రూ.19, 794 కోట్లు అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.30 కోట్లు, అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీకి రూ.40 కోట్లు, విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.168 కోట్లు, గుంటూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కి రూ.23.20 కోట్లు,
అనంతపురం ప్రశాంతి నిలయానికి రూ.12 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన.