తాను ఎలాంటి తప్పు చేయలేదు.. టీడీపీ క్రమశిక్షణ కమిటీతో ఎమ్మెల్యే కొలికపూడి..!

-

టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. టీడీపీ సీనియర్ నేత ఎంఏ షరీఫ్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణలు కొలికపూడి నుంచి వివరణ తీసుకున్నారు. ఇటీవల జరిగిన వరస సంఘటనలపై ఎమ్మెల్యేను క్రమశిక్షణ కమిటీ వివరణ అడిగింది.

తాజాగా మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. ఒక పరామర్శ కు వెళ్ళినపుడు రోడ్ మీద కంచె వేశారు అని చెప్పారు. సిమెంట్ రోడ్ పై కంచె ఏంటని పీకేసాను. కంచె వేసిన వారి కుటుంబ సభ్యులు ఆత్మహత్యా ప్రయత్నం అని తెలిసింది. రోడ్ విషయంలో ఆస్తి వివాదం ఉందని తెలిసింది. మా పార్టీ అధిష్టానం వివరణ అడిగింది. గోపాలపురం గ్రామం లో కొత్త గా నిర్మించిన సిసి రోడ్ కు సంబంధించి పంచాయితీ తీర్మానం చేసింది. వార్డు సభ్యుల్లో ఒకరు భుక్యా కృష్ణ కంచె వేశారు. అసలు ఆస్తి వివాదం లేదు.. ప్రభుత్వ భూమి, రాజకీయ కారణాల వల్ల ఇతరుల ను నడవకుండా కంచే వేశారు. కంచె వేసిన కుటుంబం టీడీపీ జవహర్ పై దాడి చేశారు. స్వామిదాస్ పై దాడి చేశారు. చంద్రబాబు పై మీకోసం యాత్రలో వాటర్ బాటిల్ వేశారు. కంచె వేసిన కుటుంబం గత ఎన్నికల్లో టీడీపీ నేతలపై దాడి చేశారు. ఈ వివరణను పార్టీ నాయకత్వానికి ఇచ్చినట్టు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version