ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న కురసాల కన్నబాబుకు ప్రాణహాని ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది హోంశాఖ. భద్రతా కారణాల దృష్ట్యా మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు వారం కిందట స్పష్టం చేశాయి. అలాగే ఇకపై బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణించాలని నిఘా వర్గాలు సూచించాయి.
దీంతో ప్రస్తుతం కన్నబాబు తన పర్యటనలన్నీ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే జరుపుతున్నారు. కాగా, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక నేత. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ ముఖ్యనేతల్లో ఒకరిగా ఉన్నారు. మంత్రి కన్నబాబుకు త్రెట్ ఉండటం, బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.