పవన్ కల్యాణ్ మూవీకి కొరియోగ్రాఫర్‌గా అల్లు అర్జున్..ఏ సినిమానంటే!?

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్..ఓ వైపున పాలిటిక్స్ మరో వైపున సినిమాలు రెండూ చేస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో త్వరలో ఆయన జాయిన్ కానున్నారు. ఇక పవన్ కల్యాణ్ కుటుంబం నుంచి ఇప్పటికే డజను మంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..ఇటీవల ‘పుష్ప’ సినిమాతో హిట్ అందుకున్నారు.

‘పుష్ప’ ఫిల్మ్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనను చూసి దేశవ్యాప్తంగా ప్రేక్షకలోకం ఫిదా అయిపోయింది. అలా స్టైలిష్ స్టార్ కాస్తా..ఐకాన్ స్టార్ మాత్రమే కాదు..పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఇక బన్నీ డ్యాన్సింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన డ్యాన్సింగ్ స్టైల్ తో ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బెస్ట్ డ్యాన్సర్ గా బన్నీ పేరు సంపాదించుకున్నారు.

pawan kalyan gudumba shankar power star

అల్లు అర్జున్ ..పవన్ కల్యాణ్ సినిమాకు ఒకదానికి కొరియోగ్రాఫర్ గా పని చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తు్న్నాయి. ఆ వార్తల ప్రకారం..ఆయన పవన్ కల్యాణ్ ‘గుడుంబా శంకర్’..సినిమాలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేశారట.

ఇందులో పవన్ కల్యాణ్ కు జోడీగా మీరా జాస్మిన్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో ‘ఎగిరే చిలకమ్మా’ సాంగ్ అల్లు అర్జున్ కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకుని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version