సమంత Vs రష్మీక.. కోల్డ్ వార్ కి కారణం..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్స్ లిస్టులో ఈమె టాప్ ప్లేస్ లో ఉందనే విషయాన్ని పలు సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఆర్ మాక్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో సమంతనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం అందుకు తగ్గట్టుగానే ఆమె కూడా పాన్ ఇండియా స్థాయిలో రాణించాలనుకోవడం గమనార్హం. ఇకపోతే ఈ విషయాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా సమంత భారీ స్థాయిలో బాలీవుడ్ లో సినిమాలు చేస్తోందనే టాక్ వినిపిస్తున్నా..ఈ విషయంపై సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం గమనార్హం.ఇక బాలీవుడ్లో తాను నటిస్తున్న చిత్రాలకు సంబంధించి ఏ ఒక విషయాన్ని కూడా సమంత తెలియజేయలేదు

ఇకపోతే సమంత ఇలా చెప్పకపోవడానికి కారణం రష్మిక అని అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా పాన్ ఇండియా సినిమా కాకపోయినా రష్మిక పుష్ప చిత్రం ద్వారా బాలీవుడ్ ఆడియన్స్ కు బాగా దగ్గరయింది. ఇకపోతే ఆమె నటించిన తొలి హిందీ చిత్రం రిలీజ్ కాకపోయినా అక్కడ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది . ముఖ్యంగా గుడ్ బై, మిషన్ మజ్ను , యానిమల్ లాంటి భారీ చిత్రాలలో నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే వరుస బాలీవుడ్ చిత్రాలతో దూసుకుపోతున్న రష్మిక వేగానికి కళ్లెం వేయడానికి సమంత రెడీ అవుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే బాలీవుడ్ లో తాను నటిస్తున్న మూడు పెద్ద సినిమా ప్రాజెక్టులను ఒకేసారి అనౌన్స్ చేసి రష్మికకు షాక్ ఇవ్వాలనుకుంటుందట సమంత. ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య ప్రొఫెషనల్ గా వార్ జరుగుతోందని .. కానీ ఈ వార్ ఎలా పుట్టింది? అనేది కూడా అర్థం కాకుండా ఉంది. ఇక ఏది ఏమైనా భవిష్యత్తులో వీరిద్దరి మధ్య కోల్డ్ వారు జరిగే అవకాశం అయితే బాగా కనిపిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version