ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..ఆర్టీసీ బ‌స్సును లారీ ఢీ కొట్ట‌డంతో..!

ఆదిలాబాద్ జిల్లా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని గుడిహత్నూర్ మండల సమీపంలోని బస్టాండ్ వద్ద గురువారం ఉదయం మంచిర్యాల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సు రోడ్డు పైకి ఎక్కే క్రమంలో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు న‌జ్జ‌య్యింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

bus accident adilabad
bus accident adilabad

అంతేకాకుండా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. స‌మాచారం అంద‌డంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంట‌నే ఆంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం అందుతోంది. ఇక ఈ ఘటనలో లారీ డ్రైవర్ దే తప్పని స్థానికులు చెబుతున్నారు. బస్సు బస్టాండ్ నుండి వస్తుండగా లారీ డ్రైవర్ చూసుకోకుండా దూసుకు వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు.