మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రహదారిపై ప్రయాణికులతో వస్తున్న బస్సుకు ఎదురుగా ఒక ద్విచక్రవాహనదారుడు వచ్చాడు. అతన్ని తప్పించబోయి పక్కన రహదారిపైకి వెళ్లిన బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 36 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.
ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ రహదారిపై చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సు కింద పోయిన సమయంలో అతివేగం కారణంగా చాలా మంది క్షతగాత్రులు అయ్యారు.వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ హైవేపై బైక్ను తప్పించబోయి బోల్తా పడ్డ బస్సు
36 మందికి తీవ్ర గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం pic.twitter.com/3fhRKCggZB
— Telugu Scribe (@TeluguScribe) March 4, 2025