IND VS AUS : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

-

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ లో జరుగనున్న తొలి సెమీస్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయనుంది. టీమిండియా ఫీల్డింగ్ చేయనుంది. ఇప్పటికే టీమిండియా వరుస విజయాలతో మంచి జోరు మీద ఉంది. వర్షం కారణంగా ఆస్ట్రేలియా జట్టు కొన్ని మ్యాచ్ లు ఆడలేకపోయింది.

2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్స్ లో ఓడిపోయింది. దానికి ఇప్పుడు ప్రతికారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు కూడా ఎలాగైనా ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కి వెళ్లాలని చూస్తోంది. ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.

టీమిండియా  జట్టు : 

రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, కే.ఎల్.రాహుల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

ఆస్ట్రేలియా జట్టు : 

ట్రావీస్ హెడ్, కూపర్ కాన్లీ, స్టీవెన్ స్మిత్, లబూషేన్, ఇంగ్లీషు, కార్వే, మాక్స్ వెల్, డ్వార్షిస్, నతన్ ఎల్లిస్, ఆడమ్ జంప, తన్వీర్ సంఘ.

Read more RELATED
Recommended to you

Latest news