ఈ మధ్య కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. రోడ్డు ఎక్కితే మరలా ఇంటికి తిరిగి వస్తామో రామో తెలియని పరిస్థితి నెలకొంది. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ఎదుటి వాళ్ళు మనల్ని బతకనిస్తారన్న గ్యారెంటీ అయితే ఉండడం లేదు. గుజరాత్ లోని అహ్మదాబాద్ అఖ్బర్ నగర్ ప్రాంతంలో నిన్న ఒక అండర్‌పాస్ స్తంభంతో బస్సు డీ కొన్న ఘటన సంచలనంగా మారింది.
బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్‌టీఎస్) బస్ ఒకటి స్థంబాన్ని గుద్దేయగా ఆ స్పీడ్ కు బస్సు రెండు ముక్కలు అయింది. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరని అహ్మదాబాద్ బిఆర్టిఎస్ జనరల్ మేనేజర్ విశాల్ ఖనామా తెలిపారు. ప్రమాద సమయంలో బస్సు లోపల ఉన్న బస్సు యొక్క డ్రైవర్ మరియు కండక్టర్ కు గాయాలయ్యాయి. వారికీ మెరుగయిన వైద్య సహాయం అందిస్తున్నారు.