మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. ఉద్యోగాలు కూడా కాదనుకుని వ్యాపారాలను మొదలుపెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు.
మీరు కూడా ఏదైనా వ్యాపారం కోసం చూస్తుంటే దీనిని చూడండి. ఈ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. పైగా ఈ వ్యాపారానికి తిరుగుండదు. ఎక్కువ పెట్టుబడి కూడా అక్కర్లేదు. తక్కువ పెట్టుబడి తో ఈ బిజినెస్ మొదలు పెట్టొచ్చు.
సుగంధద్రవ్యాల ని మనం ఎక్కువగా వాడుతూనే ఉంటాం. చాలా వంటల్లో సుగంధ ద్రవ్యాలు అవసరం వీటి నుండి మసాలాలు తయారు చేసి అమ్మితే మంచిగా డబ్బులు పొందొచ్చు. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఈ బిజినెస్ లో ఉండదు. ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టక్కర్లేదు. సుగంధద్రవ్యాల యూనిట్ తయారీ కోసం మూడున్నర లక్షలు ఖర్చవుతుంది. అలాగే ఈ వ్యాపారం కోసం 300 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డు ఏర్పాటుకు అరవై వేలు కావాలి.
పరికరాలు కోసం 40 వేలు కావాలి. అలానే మరి కొన్ని వాటికి రెండున్నర లక్షల వరకు అవుతుంది. అయితే మీరు పెట్టుబడి కోసం ఎలాంటి భయం పెట్టుకోవద్దు. ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి బ్యాంకు లోన్ ఇస్తోంది. ప్రధానమంత్రి ఉపాధి పథకం కింద ఈ వ్యాపారం కోసం లోన్ తీసుకోవచ్చు. ముద్ర ద్వారా కూడా లోన్ పొందొచ్చు.
ఈ వ్యాపారం ద్వారా ఏడాదికి 10 లక్షల రూపాయల వరకు వస్తాయి. ఖర్చులన్నీ తీసేస్తే ఇంచుమించు మూడు లక్షలు లాభం వస్తుంది అంటే నెలకు 20,000 పైగా ఆ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆన్లైన్లో ఆఫ్ లైన్ లో కూడా మీరు అమ్మితే ఎక్కువ అమ్ముడు అవుతుంది కాబట్టి ఇలా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుని ఈ వ్యాపారాన్ని మొదలు పెడితే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.