బిజినెస్ ఐడియా: ఉల్లి పేస్ట్ తయారు చేసి ఇలా అదిరే లాభాలను పొందండి..!

-

మీరు ఏదైనా మంచి వ్యాపారంను మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మంచిగా లాభాలను పొందొచ్చు. అయితే మరి ఈ బిజినెస్ ఐడియా కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

 

ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారాలను మొదలు పెడుతున్నారు. మీరు కూడా అదిరిపోయే బిజినెస్ చెయ్యాలి అనుకుంటే ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఉల్లి పేస్ట్ కి మంచి డిమాండ్ ఉంది. దీనిని మీరు క్యాష్ చేసుకోవచ్చు. ఉల్లి పేస్టు వ్యాపారాన్ని మొదలు పెడితే చక్కటి లాభాలను మీరు పొందొచ్చు. ఖాదీ ఇండస్ట్రీస్ కమిషన్ ఉల్లి ముద్ద తయారీ వ్యాపారంపై ప్రాజెక్ట్ రిపోర్ట్ ని కూడా స్టార్ట్ చేసింది దీని ప్రకారం ఈ వ్యాపారాన్ని 4.19 లక్షలతో మొదలు పెట్టొచ్చు.

మీ దగ్గర కనుక ఈ డబ్బులు లేవు అంటే ముద్ర పథకం ద్వారా లోన్ తీసుకోవచ్చు. ఈ వ్యాపారం మొదలు పెట్టాలంటే మీకు కొన్ని పరికరాలు కూడా అవసరమవుతాయి. దీనికోసం లక్షన్నర దాకా ఖర్చు అవుతుంది అలానే వ్యాపారాన్ని నడపడానికి రెండున్నర లక్షలు పైగా అవుతుంది.

ఈ యూనిట్ ద్వారా సంవత్సరంలో మీరు దాదాపు 193 క్వింటాళ్ల ఉత్పత్తి చేయవచ్చు. క్వింటాలుకు మూడు వేల రూపాయల చొప్పున 5.7 తొమ్మిది లక్షలు అవుతుంది దాని విలువ. మీరు ఉల్లి ముద్దను తయారు చేసి ప్యాకింగ్ చేసి సేల్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా వెబ్ సైట్ ద్వారా మీరు వీటిని అమ్మచ్చు. ఇలా ఉల్లి పేస్ట్ బిజినెస్ ద్వారా అద్భుతమైన లాభాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news