మీరు ఏదైనా బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే సొయా మిల్క్ బిజినెస్ ( Soya Milk Business ) చెయ్యచ్చు. ఈ బిజినెస్ వలన అదిరే లాభాలు పొందొచ్చు. ఇక ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే… సోయాలో అధిక ప్రోటీన్ కారణంగా, దాని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక మీ బిజినెస్ బాగుంటుంది. అయితే ఈ బిజినెస్ కోసం ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు.
ఇక ఏమేమి అవసరం అవుతాయి అనేది చూస్తే.. చిన్న సోయా పాల యూనిట్ ఏర్పాటు చేయడానికి 100 చదరపు మీటర్ల స్థలం అవసరం అవుతుంది. ఒకవేళ కనుక స్థలం లేదు అంటే అద్దెకు తీసుకోవచ్చు. సోయా పాల తయారీకి సోయాబీన్స్, చక్కెర, కృత్రిమ రుచులు, సోడియం బైకార్బోనేట్, ప్యాకేజింగ్ కి అవసరమయ్యే పదార్థాలు కావాలి. సోయా మిల్క్ ని లీటరుకు రూ .30 చొప్పున ఉత్పత్తి చేసి విక్రయించవచ్చు. దీని ద్వారా నెలకు ఒక యూనిట్ ద్వారా ఖర్చులతో కలిసి రూ .50 లక్షల వరకు సంపాదించవచ్చు.
ఈ వ్యాపారం చెయ్యాలంటే FSSAI లైసెన్స్ ఉంటే మంచిది. అలానే PFA చట్టం, 1955 కి అనుగుణంగా ఉండాలి. కాలుష్య విభాగం నుండి NOC కూడా అవసరం. కనుక వీటిని తప్పక తీసుకోండి. ఇక మెషీన్స్ విషయంలోకి వస్తే.. ఈ వ్యాపారానికి సోయాబీన్ గ్రైండర్, బాయిలర్, మెకానికల్ ఫిల్టర్, సోకింగ్ ట్యాంక్, ప్యాక్ సీలర్ మెషిన్, వాక్యూమ్ ప్యాకింగ్ మెషిన్ , వెయింగ్ బ్యాలెన్స్ వంటి యంత్రాలు కూడా అవసరం. కావాలంటే ముద్ర పథకం కింద లోన్ తీసుకోవచ్చు. ఇలా తక్కువ పెట్టుబడితో అదిరే లాభాలు పొందొచ్చు.