75వ స్వాంతంత్ర్య దినోత్సవం అట్టహాసంగా జరుగుతుంది. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగరవేసారు. దేశ ప్రజలకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వాంతంత్ర్య సమరంలో అమరులైన వారిని గుర్తు చేసుకున్నారు. అనంతరం, జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ ప్రసంగ ఆసక్తికరంగా సాగుతుంది. కరోనా, ఒలింపిక్స్ తదితర అంశాలు హైలైట్ గా ఉన్నాయి. కరోనా గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ, ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇక్కడే జరుగుతుందని, ఇప్పటి వరకు 54కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసామని తెలిపారు.
ఇంకా, కరోనాను భారత ప్రజలు దృఢంగా ఎదుర్కొన్నారని అన్నారు. ఇంకా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల ప్రతిభను పొగుడుతూ, దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఒలింపిక్స్ విజేతలు, కరోనా వారియర్స్, పోలీసు బలగాలపై హెలికాప్టర్ తో పూలవర్షం కురిపించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగాలని ప్రధాని పిలుపు ఇచ్చారు.