ఇంట్లో కాళీగా ఉంటున్నారా..? మీరు కూడా సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ఐడియా మీకోసం. పైగా ఇది చాల ఈజీ కూడా. చిన్న బిజినెస్ అయినా సరే మంచి ఆదాయం వస్తుంది. ఇక పూర్తిగా చూస్తే.. ఇప్పుడు చాల మందికి టిఫిన్ బాక్స్ తీసుకెళ్లడం కష్టం అయిపోతోంది. ఇంటి రుచి తో కనుక బాక్స్ కడితే ప్రతీ రోజు బాక్స్ ని మీ వద్ద నుండి తీసుకెళ్తారు.
ఒకవేళ బిజినెస్ ప్లాన్ పెద్ద ఎత్తున చేపడితే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కోసం FSSAI లైసెన్స్, GST రిజిస్ట్రేషన్, మునిసిపల్ హెల్త్ ట్రేడ్ లైసెన్సెస్, ఫైర్ లైసెన్స్ సహా స్థానిక అనుమతులు అవసరం గమనించండి. ఇక ఎంత డబ్బులు రావొచ్చు అనే విషయానికి వస్తే… ఒక్కో భోజనం బాక్స్ రూ.60గా ధర అనుకుంటే.. 100 టిఫిన్ బాక్సుల ఆర్డర్లు తీసుకుంటే రోజుకు ఆరు వందలు వస్తుంది.
అయితే మొత్తం ఖర్చులని తీసేస్తే రోజుకి రూ.3000 వస్తుంది. అంటే నెలకి 75000 దాకా ఆదాయం లభిస్తుంది. అలానే మీరు కావాలంటే ఎక్ట్రా ఐటెమ్స్ ఏమైనా పెట్టి ధర కూడా ఎంచుకోవచ్చు. మంచి రుచి, నాణ్యత కనుక ఉంటే రెగ్యులర్ గా కస్టమర్స్ వస్తారు.