ఆస్తి కోసం కన్నతల్లిని కసాయి కూతురు చంపింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. భర్తతో కలిసి గొంతు నులిమి హత్య చేసింది కూతురు. పెద్దతండాకు చెందిన లక్ష్మి.. తన కూతురు సంగీతను వీరయ్యకు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేసింది.

Atrocity in Palakurthi mandal of Janagama district Butcher’s daughter kills her maternal grandmother for property
ఎకరం భూమిలో 20 గుంటల భూమి అమ్మి సంగీతకు 9 తులాల బంగారం ఇప్పించింది తల్లి. మిగిలిన భూమి, డబ్బు కూడా ఇవ్వాలని కూతురు గొడవ పెట్టుకుంది. అందుకు లక్ష్మి ఒప్పుకోకపోవడంతో భర్తతో కలిసి తల్లిని చంపేందుకు ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే లక్ష్మి నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి హత్య చేసింది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.