టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

-

భారత్-పాక్ మ్యాచ్‌పై పిటిషన్ దాఖ‌లు అయిన సంగ‌తి తెలిసిందే. భారత్-పాక్ మ్యాచ్ పై వేసిన పిటీష‌న్ ను తిరస్కరించింది సుప్రీం కోర్టు. ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ఆగ్రహం వ్య‌క్తం చేసింది. అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరగా, తాజాగా స్పందించింది ధర్మాసనం.

Supreme Court's sensational verdict on Team India vs Pakistan match
Supreme Court’s sensational verdict on Team India vs Pakistan match

‘అది కేవలం ఒక మ్యాచ్.. అలా జరగనివ్వండి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం. రద్దు చేయాల్సిన అవసరమేంటని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదిని ప్రశ్నించింది జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం. దీంతో సెప్టెంబ‌ర్ 14 వ తేదీన జ‌రుగ‌నున్న భారత్-పాక్ మ్యాచ్ య‌థావిధిగా జ‌రుగ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news