బంగారం అంటే కొనటానికి ఇష్టపడని వారుంటారా అంటే సమాధానం కష్టమే . సాధారణంగా మనం బంగారాన్ని ఆభరణాలు, కాయిన్ల రూపంలో కొంటాం. కొంత మంది అయితే బాండ్ల రూపంలో వాటిని కొంటారు. వీటికి ప్రత్యామ్నయంగా డిజిటల్ గోల్డ్‌కు కూడా ఆదరణ పెరిగింది. అయితే ఇది ఎంతవరకు భద్రమన్నది తెలుసుకోండి.
పెట్టుబడి కోసం బంగారం కొంటే కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. వాటి
స్వచ్ఛత ఎంతన్నది గుర్తించడం కష్టం. అవసరమొచ్చి విక్రయించాలన్న దానికి ఎంత విలువ కట్టిస్తారన్నది సమస్యే. అలాంటి సమస్యలు లేకుండా డిజిటల్ గోల్డ్‌ను సులభతరంగా కొనుగోళ్లు చేయవచ్చు.
గూగల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, అమెజాన్ ఇండియా తదితర సంస్థల్లో అందుబాటులో ఉన్నాయి.ఆర్డర్ చేసిన తర్వాత అంత మొత్తానికి సరిపడా బంగారాన్ని ఈ సంస్థలు భౌతికరూపంలో కొనుగోలు చేసి ఇన్వెస్టర్ల పేరు మీద వారి ఖజానల్లో భద్రపరుస్తాయి. గ్రాము లేదా రూపాయి నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
చార్జీలు
ఎమ్‌ఎమ్‌టీసీ, పీఏఎమ్‌పీ 99.9 శాతం ప్యూరిటీ బంగారాన్ని ఇస్తుంది. సేఫ్‌గోల్డ్ 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్‌కుఇస్తోంది. మొదటి రెండు ఏళ్లు ఎలాంటి చార్జీలు ఉండవు. గరిష్టంగా ఏడేళ్లవరకు గోల్డ్‌ను భద్రపరచుకోవచ్చు. గడువు తీరిన తర్వాత మార్కెట్ ఆధారంగానే చెల్లింపులు చేస్తారు. అలాగే 2.5శాతం వడ్డీని చెల్లిస్తారు.
కొనుగోళ్లలో అనుకూలతలు
- ఒక్కరూపాయి నుంచే కొనుగోలు చేయడం
- 24 క్యారట్ల స్వచ్ఛత కలిగినవి.
- కొన్న పసిడికి బీమా ఉంటుంది.
- డిజిటల్ గోల్డ్‌ను కాయిన్లు, ఆభరణాలు, బులియన్ మార్కెట్‌లో మార్పిడి చేయవచ్చు.
ప్రతికూలం
- రూ.2 లక్షలు మాత్రమే పరిమితి
- డిజిటల్ గోల్డ్‌పై 3 శాతం జీఎస్టీ చెల్లించాలి.
- కొన్నరోజే అమ్మలేని పరిస్థతి
- స్టోరేజీ చార్జీలు, బీమా 3 శాతం వరకు ఉంటాయి.
వీటి నియంత్రణకు ట్రస్టీలు ఉంటారు. కానీ, ఏవిధంగా నిల్వ చేస్తున్నరని చూసే యంత్రాంగం లేదు. గోల్డ్ ఈటీ ఎఫ్‌ల పైన అయితే సెబీ నియంత్రణ ఉంటుంది. కనుక డిజిటల్ గోల్డ్ కొనేవారు బీమా ఉందా? లేదా? చూసుకొని ఆ తర్వాత కొనండి.