బెంగుళూరు అనగానే.. అందరికి అబ్బా కూల్ సిటి బాగుంటుంది కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ.. ఇంటి అద్దెకే సగం శాలరీ పోతుంది అనే డైలాగ్ వచ్చేస్తుంది. బెంగుళూరులో ఇంటి అద్దె ఎక్కువ ఉంటుంది. ఇంకా మనలా ఇళ్లు అద్దెకు తీసుకుని నచ్చకపోతే..రెండు నెలలకే వచ్చేది ఉండదు. ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు బాండ్ రాయించుకున్నట్లు రాయించుకుంటారు.. కానీ ఇళ్లు అద్దెకు తీసుకునే ముందు ఇంటి వోనర్స్ అడిగే ప్రశ్నలు మీరు ఫేస్ చేసే ఉంటారు. అబ్బాయిలైతే.. తాగడం, అమ్మాయిలను తీసుకురావడం నో చాన్స్.. నైట్ త్వరగా రావాలి.. ఇలా ఏవేవో చెప్తారు. కానీ బెంగుళూరులో ఇంటి ఓనర్స్ వీటికి మించి అడుగుతున్నారట…
బెంగుళూరులో ఇళ్ల యజమానులు పెట్టే వింత కండిషన్లు వింటే పిచ్చెక్కినంత పని అవుతుంది. తాజాగా ప్రియాన్ష్ జైన్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హౌస్ బ్రోకర్‌ను ఇల్లుకావాలని సంప్రదించాడు. ఐతే సదరు బ్రోకర్‌గారు అడుగుతున్న వివరాల లిస్టు చూడగానే మనోడికి కళ్లు బైర్లుకమ్మాయట. బ్రోకర్ అడిగిన ప్రశ్నలకు.. తాను అట్లాసియన్‌లో పనిచేస్తున్నానని, పూర్తిగా శాఖాహారినని జైన్ చెప్పాడు. ఆ తర్వాత మీరు ఎక్కడ చదివారు అనే ప్రశ్నకు.. నేను వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివానని జైన్ చెప్పాడు. అంతే.. మీకు ఇల్లు ఇవ్వడం కుదరని వెనుదిరిగాడు. జైన్‌కు అర్థంకాలేదు.. ఎందుకని ప్రశ్నించగా.. కేవలం IIT, ISB, IIM, CA గ్రాడ్యుయేట్లకు మాత్రమే ఇక్కడి ఓనర్లు ఇల్లు ఇస్తారు. శాలరీ స్లిప్పులు, లింకెడిన్ ప్రొఫైళ్లు, గర్ల్ ఫ్రెండ్ల వివరాలు చెపితేగానీ ఇల్లు అద్దెకు దొరకదని చెప్పాడు. జైన్ మాత్రమే కాదు.. ప్రస్తుతం బెంగళూరులోని అనేక మంది పరిస్థితి ఇదే పాపం..
తాను ఎదుర్కొన్న అనుభవాన్ని ప్రియాంష్ జైన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌పై స్పందించిన పలువురు తాము కూడా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నట్లు కామెంట్ సెక్షన్‌లో తెలిపారు. బెంగళూరులో ఓ అద్దె ఇంటిని సంప్రదిస్తే.. నా లింక్డ్‌ఇన్ ప్రొఫైల్, గర్ల్ ఫ్రెండ్స్ వివరాలు అడిగారు. ఇళ్ల యజమానుల పిచ్చి పీక్‌కి చేరినట్లుందని అర్నవ్ గుప్త అనే ఇంజనీర్ కమెంట్ చేశాడు. గతంలో ఉన్న ఇంటికి సంబంధించి లీవింగ్ సర్టిఫికేట్ అడిగినట్లు మరొకరు తెలిపారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయా..?