హార్దిక్ పాండ్యా న్యూ లుక్…రెండో పెళ్లికి సిద్ధం!

-

టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త లుక్ తో కనిపించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్లాటినం గ్లాండ్ హెయిర్ స్టైల్ తో హార్దిక్ పాండ్యా న్యూ హెయిర్ స్టైల్ లో కనిపించారు. ఈ న్యూ లుక్ ఫోటోలను తనలో షేర్ చేసుకోగా అవి వైరల్ అవుతున్నాయి. ఆసియా కప్ కోసం హార్దిక్ పాండ్యా రెడీ అయ్యారని అతడి ట్రాన్స్ఫమేషన్ అదిరిపోయిందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఆసియా కప్ 2025 సెప్టెంబర్, 9న మొదలయ్యే ఈ టోర్నీ కోసం హార్దిక్ పాండ్యా ఇప్పటికే దుబాయ్ కి చేరుకున్నారు.

hardik pandya
hardik pandya

హార్దిక్ పాండ్యా న్యూ లుక్ తోనే దుబాయ్ కి చేరుకున్నారు. హార్దిక్ పాండ్యా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా హార్దిక్ పాండ్యా అభిమానులు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా… హార్దిక్ పాండ్యా న్యూ లుక్ చూసి సోషల్ మీడియా వేదికగా అతడు రెండవ పెళ్లికి రెడీ అవుతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. అందుకోసమే హార్దిక్ తన కంప్లీట్ లుక్ మార్చేశారని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news