తెలంగాణలో బీవైడీ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ పెట్టుబడులు

-

తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రానున్నది.చైనా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ సంస్థ బీవైడీ..హైదరాబాద్ సమీపంలో విద్యుత్తు కార్ల యూనిట్ స్థాపనకు యోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయపై కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు సాగిస్తూ.. ఇటీవల తుది నిర్ణయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం.

హైదరాబాద్ పరిసరాల్లో యూనిట్ ఏర్పాటుకు అనువైన మూడు ప్రదేశాలను బీవైడీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయానికి రాగానే, ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభించే ఆస్కారం ఉన్నది.

Read more RELATED
Recommended to you

Latest news