హోం మంత్రి పదవి రావడంపై రాజగోపాల్ ట్వీట్ చేశారు. మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరెవరికి ఏ శాఖ కేటాయించాలనే విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అవుతుందని వెల్లడించారు.. ఆ రోజు అసెంబ్లీలో కొంతమంది మీడియా మిత్రులు ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి, శాఖల కేటాయింపు ఎలా ఉంటుందని విషయంలో చిట్ చాట్ చేసిన సందర్భంలో చెప్పడం జరిగిందన్నాడు.

మా కార్యకర్తలు, అభిమానులు నాకు హోం శాఖ మంత్రి అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారని, అంతేతప్ప నాకు హోం శాఖ ఇవ్వాలి, హోం మంత్రి అయితేనే బాగుంటుంది అనే విషయాలు మీడియా మిత్రుల వద్ద చర్చకు రాలేదు.. మంత్రి పదవులు ఇచ్చే విషయంలో శాఖల కేటాయింపు విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్… అధిష్టానం నన్ను గుర్తించి మంత్రివర్గంలో చోటు కల్పించి ఏ శాఖ అప్పగించినా బాధ్యతాయుతంగా పనిచేసి ఇటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడానికి, అటు ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి అహర్నిశలు పాటుపడుతూనే ఉంటా అంటూ పోస్ట్ చేశారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.