జో బైడెన్‌ మొదటి సంతకం దేనిపైనో తెలుసా..?

-

ఎన్నికల ప్రచారంలో జోబైడెన్‌ ఇచ్చిన హామీలకు ఆకర్షితులైన అమెరికన్లు, ట్రంప్‌ పాలనకు స్వస్తి పలికి బైడెన్‌కు పట్టం కట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆయన కూడా సన్నహాలు చేస్తున్నారు. పదవి స్వీకారం చేసిన మొదటి రోజు బైడెన్‌ కొన్ని కీలక కార్యనిర్వహక ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నట్లు, త్వరలో వైట్‌ హౌస్‌కు కానున్న చీఫ్‌ఆఫ్‌ స్టాఫ్‌ రోన్‌ క్లెయిన్‌ స్పష్టం చేశారు. మొట్టమొదటగా జోబైడెన్‌ 12 ముఖ్యమైన దస్త్రాలపై సంతకాలు చేస్తారని.. అందుకోసం ఇప్పటికే తగు ఏర్పాట్లు చేసినట్లు రోని పేర్కొన్నారు.

మానవత్వ దిశగా..

కోవిడ్‌ ఆంక్షలను విస్తరించడం, ముస్లిం దేశాలకు రాకపోకలకు వి«ధించిన నిషేధాన్ని ఎత్తివేయడం, పారిస్‌ ఒప్పందంలో∙చేరడం తదితర కీలక అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. ట్రంప్‌ కఠిన చర్యలతో కుటుంబాలకు దూరమై వలసలు వచ్చిన వారి విషయంలో బైడెన్‌ మానవత్వం చాటి ఓ మంచి నిర్ణయానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఆ తర్వాత విద్యా సంస్థలు పునః ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలు అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరోనా వ్యాప్తిని పూర్తిగా కట్టడి చేసేందుకు చర్యలపై బైడెన్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటారని వైట్‌హౌస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య ప్రమాణాల్ని పెంచడం, కరోనా యెధులకు మరింత రక్షణ, నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచడం వంటి అంశాలపై ఓ నిర్ణయం తీసుకుంటారని సూచించారు. వీటితో పాటు 100 రోజలు మాస్క్‌ తప్పని సరి చేసేలా చర్యలు చేపడతారని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version