సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.అయితే కేంద్రప్రభుత్వం తెచ్చిన సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పటికే పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా CAAలోని కొన్ని నిబంధనలు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని అమెరికా చట్టసభ పరిశోధన విభాగం సీఆర్ఎస్ ఓ నివేదికలో పేర్కొంది. పాక్, బంగ్లా, అఫ్గాన్ నుంచి భారత్కు వలస వచ్చిన ఆ దేశాల మైనారిటీలకు సీఏఏ ద్వారా భారత్ పౌరసత్వం అందిస్తుంది.
అయితే ముస్లింలను మినహాయించడం రాజ్యాంగానికి సమ్మతం కాదని సీఆర్ఎస్ పేర్కొంది. రాజకీయ కారణాలతోనే ఈ చట్టాన్ని సర్కారు తీసుకొచ్చిందని అభిప్రాయపడింది.కాగా, ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.