మొదలయిన కేంద్ర క్యాబినెట్ భేటీ .. రైతుల ఆందోళనే ప్రధాన అజెండా !

-

కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం అయింది.  రైతుల అందోళన తో ఏర్పడ్డ ప్రతిష్ఠంభనను తొలగించేందుకు కీలక  నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అమలు పై చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. ఆర్డినెన్స్ జారీ ద్వారా “కనీస మద్దతు ధర” అమలు చేసే అవకాశం పై చర్చ జరుగుతోంది.

ముందుగా కేంద్ర ఆర్ధిక వ్యవహారాల మంత్రి వర్గం సమావేశం అయింది. డిసెంబర్‌ 9న జరిగిన చివరి సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన(ఏబీఆర్‌వై)లో భాగంగా అధికారిక రంగంలో ఉపాధిని పెంచేందుకు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ 3.0 కింద కొవిడ్ -19 రికవరీ దశలో కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. ఈరోజు ఏమి ప్రకటిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version