తెలంగాణ 2021-22 కాగ్‌ నివేదిక విడుదల…75 శాతం అప్పులు చెల్లింపులే

-

తెలంగాణ అసెంబ్లీలో 2021-22 కాగ్‌ నివేదిక విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. 2019- 20 లో తీసుకున్న ఆప్పుల్లో 75 శాతం అప్పులు చెల్లించేందుకు సరిపోయిందని వెల్లడైంది. 2019 – 20 లో రెవెన్యూ మిగులు సాధించలేదని… ద్రవ్య లోటు పుడ్చు కోవడం కోసం 97 శాతం మార్కెట్ రుణాల ద్వారానే ఆదాయం ఉందని స్పష్టంగా కాగ్‌ నివేదిక లో తేలింది.

విద్య, ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం తక్కువ ఖర్చు చేసిందని… 2019-20 లో రెవెన్యూ రాబడి రూ.1124 కోట్లు పెరిగిందని వెల్లడైంది. రెవెన్యూ వ్యయం రూ. 11715 కోట్లు పెరిగిందని.. వడ్డీ చెల్లింపులు 1800 కోట్లకు పెరిగిందని కాగ్‌ తేలిపింది.

అలాగే… క్యాపిటల్ వ్యయం బాగా పడిపోయిందని… సాగు నీటి ప్రాజెక్టులు త్వరితంగా పూర్తి చేయకపో వడం తో క్యాపిటల్ నిధులు చిక్కుకు పోయాయని స్పష్టం చేసింది. విద్యుత్ దిస్కం లు ఉదయ్ పథకం కింద తీసుకున్న అప్పులు.. 4 వేల కోట్లు చెల్లించలేదని తెలిపింది. బడ్జెట్ అమలు నియంత్రణ సరిగా లేదని… బడ్జెట్ లో ఆమోదానికి మించి అధిక వ్యయం చేస్తుందని పేర్కొంది. ఐదేళ్లలో 84, 650 కోట్ల అధిక వ్యయం చేసిందని కాగ్‌ నివేదికలో తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version