లోన్ యాప్‌లలో చేసిన అప్పుడు ఉరి తాడుల్లా మెడకు చుట్టుకుంటున్నాయి. అవసరం కోసం తీసుకున్న రుణం.. సమయానికి కట్టకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతోంది. లోన్ యాప్ నిర్వాహకుల బెదిరింపులు, వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. దీంతో ఈ విషయాన్ని జగన్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. లోన్ యాప్‌ల అరాచకాలను కట్టడి చేయడానికి కంకణం కట్టుకుంది.
వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతోన్న లోన్ యాప్‌లపై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసి.. తమ ఫిర్యాదులను తెలియజేయాలని పేర్కొంది. 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపింది. అలాగే ఆన్‌లైన్ మోసాల నుంచి దూరంగా ఉండాలని సూచించింది. బ్యాంక్‌కు సంబంధించిన వివరాలు ఎవరికీ తెలియజేయొద్దని వెల్లడించింది.