మహిళ బాత్రూంలో కెమెరాలు : నిందితుడు అరెస్ట్

హైదరాబాదులోని జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ వన్ డ్రైవ్ లో పనిచేస్తున్న మైనర్ బెనర్జీ అరెస్టయ్యాడు. బాత్రూం లో సెల్ఫోన్ చూసి ఓ యువతి ఫిర్యాదు చేసే నేపథ్యంలో… ఇవాళ నిందితుడు బెనర్జీని పోలీసులు అరెస్టు చేశారు. బాత్ రూమ్ లో సెల్ ఫోన్ ద్వారా బెనర్జీ వీడియోలను చిత్రీకరించాడు.

arrest
arrest

రెండు రోజుల క్రితం కొత్త సెల్ ఫోన్ కొన్న బెనర్జీ… సెల్ఫోన్ తీసుకెళ్లి లేడీస్ బాత్రూం లో పెట్టి వీడియోలు రికార్డు చేశాడు. ఏకంగా నాలుగు గంటల పాటు బాత్ రూమ్ లో ఉన్న దృశ్యాలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు బెనర్జీ. అయితే ఓ మహిళ ఫిర్యాదు మేరకు.. వన్ డ్రైవ్ లో పనిచేస్తున్న హౌస్కీపర్ బెనర్జీని అదుపులోకి తీసుకున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. అంతే కాదు బెనర్జీ తో పాటు వన్ డ్రైవ్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక అటువంటి వ్యవహారం పై పోలీసులను ఆశ్రయించిన యువతులు.. తమ వీడియోలు బయటకు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.