ఫైజర్ ఇంక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి ఇప్పుడు కాస్త ప్రపంచం ఆసక్తిగా ఉంది. ఈ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పని చేస్తుంది అని 90 శాతం వరకు బాగుంది అని ప్రకటించారు. అయితే ఈ వ్యాక్సిన్ పై అమెరికా అంటూ వ్యాధి వైద్యుడు ఆంథోని ఫౌసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేసుల పెరుగుదలలో ఈ వ్యాక్సిన్ ని వాడితే కట్టడి చేయొచ్చు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.
“అసాధారణంగా అధిక స్థాయి సామర్థ్యాన్ని కలిగి ఉంది అన్నారు. 90% కంటే ఎక్కువ, 95% కి దగ్గరగా ఉంది అన్నారు. నేను ఆశిస్తున్నది ఏమిటంటే, సాధారణంగా వ్యాక్సిన్ల గురించి కొంత సందేహాలు ఉన్నప్పటికీ, ఈ టీకా ఎంత ప్రభావవంతంగా ఉందో సాధారణ ప్రజలకు మనం ఇచ్చినప్పుడే అర్ధమవుతుంది అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ ఫౌసీ పేర్కొన్నారు. డిసెంబరు చివరిలో ప్రాధాన్యత ఉన్న వారికి టీకా వేసే అవకాశం ఉందని చెప్పారు.