LIC అదిరే పాలసీ.. రూ. 73 డిపాజిట్ చేస్తే 10 లక్షలు పొందొచ్చు..!

-

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. వీటి వలన చాలా మంది ప్రయోజనాలను పొందుతున్నారు. మీరు కూడా మీరు LICలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండ ఈ స్కీమ్ గురించి చూడాల్సిందే. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

LIC

ఈ స్కీమ్ లో రోజుకి రూ. 73 డిపాజిట్ చేయడం ద్వారా చివరకి 10 లక్షల రూపాయలు వస్తాయి. ఈ పాలసీ పేరు న్యూ జీవన్ ఆనంద్ పాలసీ. మెచ్యూరిటీపై 10 లక్షల రూపాయలు ఈ పాలసీ ద్వారా పొందొచ్చు. పైగా లైఫ్‌టైమ్ డెత్ కవర్ పొందుతారు. రూ.10 లక్షల కార్పస్ చేయడానికి ప్రతిరోజూ రూ.73 పెట్టుబడి పెట్టాలి.

ఇక ఈ పాలసీ పొందడానికి ఎవరు అర్హులు అన్నది చూస్తే.. మీ వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. 50 ఏళ్ల లోపు వారు ఈ పాలసీకి దరఖాస్తు చేసుకోచ్చు. గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 75 సంవత్సరాలు. కనీస పాలసీ వ్యవధి 15 సంవత్సరాలు. గరిష్ట పాలసీ వ్యవధి 35 సంవత్సరాలు. ప్రీమియం ని వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక, నెలవారీ కింద చెల్లించచ్చు. హామీ మొత్తం గరిష్ట పరిమితి లేదు. కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ ఒక లక్ష రూపాయలు.

ఈ పాలసీ తీసుకోవడం వలన సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఈ పాలసీని 24 సంవత్సరాల వయస్సులో రూ. 5 లక్షల బీమాతో కొనుగోలు చేస్తే సంవత్సరానికి దాదాపు రూ. 26815 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దాదాపు రూ.73.50 అవుతుంది. 21 సంవత్సరాల పాటు పాలసీని తీసుకుంటే మీ మొత్తం పెట్టుబడి దాదాపు 5.63 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో బోనస్‌తో పాటు రూ.10 లక్షల కంటే ఎక్కువ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version