చాలా మంది నచ్చిన పథకాల్లో డబ్బులని పెడుతుంటారు. మీరు కూడా మంచి స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంటే ఇది బెస్ట్ స్కీమ్. మీరు ప్రతి నెలా రూ .14 వేలు ఈ స్కీముతో పొందవచ్చు. ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ పేరుతో ఈ స్కీమ్ ని అందిస్తోంది. దీని ద్వారా పలు బెనిఫిట్స్ పొందొచ్చు. 60 ఏళ్లు వచ్చిన తర్వాతి నుంచి ఈ స్కీమ్ కింద ప్రతీ నెలా కూడా డబ్బులని పొందవచ్చు.
మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి చేతికి ఎక్కువ డబ్బులని పొందవచ్చు. అంతే కాదు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మీరు పొందవచ్చు. అలానే ఈ స్కీమ్‌లో చేరితే మూడు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. ప్రతి నెలా పెన్షన్ ని ఈ స్కీమ్ కిందన పొందవచ్చు. ప్రతి నెలా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేక పోతే ఏడాదికి ఒకే సారి డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 70 ఏళ్లు వచ్చే వరకు ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యవచ్చు. 60 ఏళ్లు వచ్చిన తర్వాత 60 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇంకా 40 శాతం మొత్తంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ. 50వేల వరకు అదనపు ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. సెక్షన్ 80సీడీ (1బీ), సెక్షన్ 80 సీ కింద ప్రయోజనం ఉంటుంది. 30 ఏళ్ల వయసులో ఉన్న వారు ప్రతి నెలా రూ. 3 వేలు ఇన్వెస్ట్ చేస్తే 60 ఏళ్లు వచ్చేసరికి రూ. 68 లక్షలు ఉంటాయి. రూ. 27 లక్షలు పెట్టి యాన్యుటీ ప్లాన్ కొనాలి. నెల నెలా దాదాపు రూ.14 వేల పెన్షన్ ని మీరు తీసుకోవచ్చు. రూ.41 లక్షలు ఒకేసారి మీరు పొందవచ్చు.