కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా రకాల బెనిఫిట్స్ ని పొందేందుకు అవుతుంది. అలానే కేంద్రం మనీ ప్రైజ్‌ను కూడా అందిస్తూ వుంది. అయితే దీనిలో తాజాగా భారత ప్రభుత్వం దేశ ప్రజలకు ఇంకో బంపర్ ఆఫర్ ని ఇస్తోంది.
రూ. లక్ష పొందే అవకాశం ని కల్పిస్తోంది. ఇక పూర్తి వివరాలని చూస్తే ఆయుష్మాన్ భారత్ పథకానికి కొత్త లోగో డిజైన్ ని చెయ్యాలని.. కొత్త లోగో డిజైన్ చేసి డబ్బులని పొందే అవకాశం వుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. కొత్త లోగో డిజైన్ చెయ్యాలని కేంద్రం ప్రజలకు సూచించింది. 2021 అక్టోబర్ 25వ తేదీన ఆయుష్మాణ్ భారత్ పేరు తో పధకాన్ని స్టార్ట్ చేసింది కేంద్రం. దేశం లో పేద ప్రజలకు ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ని ఇస్తున్నారు.
ఆయుష్మాణ్ భారత్ ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయం అందిస్తారు. అయితే ఈ పథకానికి కొత్త లోగోను డిజైన్ చేయాలని ప్రజలను ప్రభుత్వం కోరింది. ఎవరైతే మంచి లోగో ని డిజైన్ చేస్తారో వారికి రూ. లక్ష బహుమతిగా అందిస్తారు. లోగో డిజైన్ చెయ్యాలని ఆసక్తి ఉంటే మీ లోగో ని ఆన్‌లైన్ లో సబ్మిట్ చెయ్యచ్చు. జనవరి 12వ తేదీ లోగోను సబ్మిట్ చేయడానికి ఆఖరి తేదీ. 970కి పైగా మంది లోగోలను ఇప్పటికే పంపారు. మరిన్ని వివరాలని మీరు అధికారిక వెబ్ సైట్ లో చూడచ్చు.