పెట్రోలియం జెల్లీని ఇలా కూడా వాడ్చొచ్చా..? అబ్బాయిలూ మీకే చెప్పేది..!!

-

మనలో చాలామంది.. ఒక వస్తువును ఒక్కదానికి మాత్రమే వాడతారు..ముఖ్యంగా మగవాళ్లు.. పాపం వీళ్లకు ఇలాంటి వాటిపై ఐడియా ఉండదు.. అదే ఆడవాళ్లు అయితే.. ఒక్కదాన్ని పది పనులకు అయినా వాడేస్తారు. బ్యూటీ టిప్స్‌లో వంటిట్లో ఉండే ప్రతీది వీళ్లకే కావాలి. అయితే పెట్రోలియం జెల్లి గురించి మనందరికి బాగా తెలుసు.. దీన్ని పేదాలకు, కాళ్లకు, చేతులకు మాత్రమే అప్లై చేసుకుంటారు. కానీ ఈ పెట్రోలియం జెల్లీని ఇంకా ఎన్ని విధాలుగా వాడొచ్చో మీకు తెలుసా..? ముఖ్యంగా మగవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటారా..?

ఇక సమ్మర్‌ వచ్చిందంటే.. చెమట వాసన వస్తుంది. ఇంట్లోంచి బయటకు వెళ్లేప్పుడు ఎంత డియోడ్రెంట్స్‌, పర్య్ఫ్యూమ్స్‌ కొట్టుకున్నా కొద్దిసేపటికే చెమట వాసన వచ్చేస్తుంది. ఇలా కాకుండా.. మీరు కొట్టుకున్న డియోడ్రెంట్ వాసన ఎక్కువ సేపు ఉండాలంటే.. పెట్రోలియం జెల్లీని వాడొచ్చు.. ఎలా అంటే..బాడీ స్ప్రే లేదా డియోడరెంట్ ఉపయోగించే ముందు, మీ శరీర భాగాలకు తేలికపాటి పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి, ఆపైన డియోడరెంట్ స్ప్రే చేసుకోండి. అప్పుడు స్ప్రే స్మెల్‌ ఎక్కువ సేపు ఉంటుంది.

బూట్లు రోజులు గడుస్తున్నకొద్దీ పాతబడతాయి.. రోజూ ఆఫీస్‌కు వెళ్లే ముందు.. వాటికి ఉన్న దుమ్ము- ధూళిని అలా పైపన క్లీన్‌ చేసుకోని పోతాం.. ఇదొక పెద్ద టాస్క్.. ఇలా ధుమ్ముపట్టిన బూట్లను కూడా కొత్తవాటిలా మెరిసేలా చేయటానికి మీకు బూట్ పాలిష్ అవసరం లేదు, మీ వద్ద పెట్రోలియం జెల్లీ ఉంటే చాలు. ముందుగా మీ బూట్లను ఒక గుడ్డతో శుభ్రంగా తుడవండి, అనంతరం మీ బూట్లకు కొద్దిగా పెట్రోలియం జెల్లీ రాసి పాలిష్ చేసేటపుడు బ్రష్‌తో రుద్దుతారో అలాగే పాలిష్ చేయండి. మీ పాత బూట్లు కొత్తవాటిలా మెరుస్తాయి.

షేవింగ్ చేసుకునేటపుడు ఎక్కడైనా చర్మం కట్ అయితే ఆ ప్రాంతంలో పెట్రోలియం జెల్లీని రాయొచ్చు. ఇది ఇది అదనపు రక్త ప్రసరణను నియంత్రించడంలో సహాయపడుతుంది. గాయం వలన అయ్యే మచ్చలను తగ్గిస్తుంది. షేవింగ్ కట్స్ జరిగినపుడు మీ వద్ద ఏ ఆయింట్మెంట్ లేనపుడు పెట్రోలియం జెల్లీని ఉపయోగించండి.

సాధారణంగా మగవారు తమ గోళ్లపై ఎక్కువగా శ్రద్ధ పెట్టరు.. గోళ్లలో పగుళ్లు ఏర్పడటం, రంగు మారటం, పొడిగా నిర్జీవంగా మారినట్లు తయారవుతాయి. మీ గోళ్ల ఆరోగ్యం బాగుండాలంటే గోళ్లకు పెట్రోలియం జెల్లీని రాయండి. తద్వారా అది మీ చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. గోళ్లు మృదువుగా, ప్రకాశవంతగా మారతాయి.

అమ్మాయిలైతే.. కనుబొమ్మలను హైలైట్ చేయడానికి కాటుక వాడతారు. మగవారు పెట్రోలియం జెల్లీని వాడవచ్చు. మీకు కనుబొమ్మలలో వెంట్రుకలు తక్కువ ఉన్నప్పుడు, మీ కనుబొమ్మలు సరిగ్గా కనిపించనపుడు మీ కనుబొమ్మలపై కొద్దిగా వాసెలిన్‌ను పూయండి. కనుబొమ్మలు మందగా కనిపిస్తాయి. దీంతో మీ లుక్క్ అదిరిపోతుంది..సో.. ఇందుమూలంగా అబ్బాయిలందరీకి చెప్పేదంటే.. పెట్రోలియం జెల్లీని ఇన్ని రకాలుగా కూడా వాడొచ్చు..అవసరం అనిపిస్తే.. ఈసారి నుంచి ట్రై చేసేయండి..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version