క్షణాల్లోనే వచ్చి విద్యార్థిని కాపాడిన 108 సిబ్బంది

-

నేటి కాలంలో చిన్న-చిన్న పిల్లలకు కూడా గుండెపోటు వస్తున్న సంఘటనలు మనకు తరుచుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్ విద్యార్థినికి పరీక్ష రాస్తుండగానే గుండెపోటుకు గురైంది. ఇదే సమయానికి సీపీఆర్ చేయడంతో ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు పరీక్ష రాస్తున్న సమయంలో బిందు అనే ఇంటర్‌ విద్యార్ధిని గుండెపోటుకు గురైంది.

దీంతో పరీక్ష కేంద్రంలోని పీఆర్డీవో వెంకటేశ్వర్లు వెంటనే 108కు ఫోన్ చేశారు. క్షణాల్లోనే షరీక్ష కేంద్రానికి చేరుకున్న 108 సిబ్బంది సీపీఆర్ చేసి ఆ విద్యార్థిని రక్షించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో అన్ని వయసుల వారికి గుండెపోటు రావడం సహజమైపోయింది. టీనేజ్ పిల్లలకు కూడా హార్ట్ అటాక్ రావడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. అప్పటిదాకా ఉల్లాసంగా ఉన్న వాళ్లు కూడా ఉన్నట్టుండి నేలరాలిపోతున్నారు. ఆసుపత్రులకు తీసుకెళ్లే లోపే ప్రాణాలు విడుస్తున్నారు. ఎవరైనా గమనించి వెంటనే సీపీఆర్ చేస్తే ప్రాణాలతో బయటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీపీఆర్ పై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వాలు కూడా ప్రజలకు సూచిస్తున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version