ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇండియా ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ గెలిచి ఫైనల్ వరకు వెళ్ళింది. ఇండియా విజయాలను ఎ ఒక్క టీం కూడా ఆపలేకపోయిందంటే అప్పాయుడే విశ్వవిజేత అయినట్లే లెక్క. కానీ ఫైనల్ లో ప్రత్యర్థిని ఓడించి కప్ ను సొంతం చేసుకుంటే ఆ కిక్కే వేరు. కాగా వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే కప్ ను ముద్దాడింది. ఒకటి 1983 లో ఇంగ్లాండ్ గడ్డపై కపిల్ దేవ్ సారథ్యంలో అందుకుని మొదటి సారి చరిత్ర సృష్టించారు.. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత రెండవ సారి మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2011 లో ఇండియా గడ్డపై జరిగిన వరల్డ్ కప్ లో శ్రీలంక ను ఓడించి కప్ అందుకుంది.
ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో మూడవ సారి కప్ ను గెలుచుకునే సువర్ణావకాశం వచ్చింది. చరిత్ర సృష్టించాలంటే, కపిల్ దేవ్ మరియు ధోని ల సరసన రోహిత్ నిలవాలంటే.. ఖచ్చితంగా ఆదివారం జరగనున్న ఫైనల్ లో మోదీ ఎదురుగా ఉండగా ప్రత్యర్థిని ఓడించి తీరాల్సిందే.