నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

-

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ఇవాళ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతుంది. ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్ ను రూపొందించినట్టు సమాచారం. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 10 శాతం ఎక్కువ. ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.

ఈ బడ్జెట్ లో సూపర్ సిక్స్ కు భారీగా కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఉదయం 10 గంటలకు మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మరో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సమాచారం. మరోవైపు తొలిసారి బడ్జెట్ పుస్తకాల ముద్రణను ఆపేసిన ప్రభుత్వం ఆ వివరాలు ఉండే పెన్ డ్రైవ్ ను సభ్యులతో పాటు మీడియాకు కూడా ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version