ఇంట్లో నుండే కరోనా టెస్ట్ చేసుకోవచ్చు: ఐసిఎంఆర్..

-

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇంట్లోనే కరోనా వైరస్ టెస్ట్ చేసుకోవచ్చని చెప్పింది అయితే ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా, ఏ మెడికల్ ప్రొఫెషనల్ సపోర్ట్ లేకుండా టెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కోవిసెల్ఫ్ అనే యాప్ ద్వారా హోమ్ టెస్టింగ్ చేసుకోవచ్చని ఇది చాలా ఇది సులభమని దీనికోసం కేవలం శ్వాబ్స్ మాత్రమే కావాలి అని చెప్పింది. ఇది అప్రూవ్డ్ మరియు చెక్ చేసుకోవడానికి సులభమని వెల్లడించింది.

దీనిని ఎలా ఉపయోగించాలి..?

రెండు వీడియో లింక్స్ ని ప్రజలకి అర్థం అవడానికి ఐసీఎమ్ఆర్ పోస్ట్ చేసింది. ఇది ఒక పౌచ్ తో వస్తుంది. దానిలో నాజిల్ శ్వాబ్ ఉంటుంది. అదే విధంగా ప్రీ ఫీల్డ్ ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్ మరియు ఒక టెస్ట్ కార్డు ఉంటుంది. మై ల్యాబ్ అప్ ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఉండే వివరాల్ని ఫిల్ చేయాలి.

శ్వాబ్ తాలూకు హెడ్ ని ముట్టుకోకుండా రెండు నోస్ట్రయిల్స్ లో రెండు మూడు సెంటీమీటర్ల వరకు పెట్టుకోవాలి. ఐదు నిమిషాల పాటు దానిని రోల్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ట్యూబ్ ని తీసేసి ట్యూబ్ లో దానిని ముంచాలి. కిందకి అడ్మిన్ నొక్కి పది సార్లు దానిని తిప్పాలి.

అప్పుడు ట్యూబ్ లో అది ఫిట్ అవుతుంది ఈ రిజల్ట్ కోసం 15 నిమిషాలు వెయిట్ చేయాలి ఇరవై నిమిషాల తర్వాత ఏమైనా రిజల్ట్ వస్తే అది ఇన్వాలిడ్. పదిహేను నిమిషాల తర్వాత ఆప్ లో మీకు రింగ్ వచ్చి రిజల్ట్ వస్తుంది.

ఇలా మీరు చేసుకునే టెస్ట్ మీకు యాప్ ద్వారా లభిస్తుందని సులువుగా టెస్ట్ చేసుకోవచ్చని పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇంక ఏ టెస్ట్ చేసుకోక్కర్లేదు అని కరెక్ట్ గా ఒకవేళ టెస్ట్ లో నెగిటివ్ వస్తే ఆర్తీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version