గోళ్లు ద్వారా కరోనా సోకుతుందా…?

-

కరోనా వైరస్ వల్ల మనమందరం సతమతమవుతున్నారు. ఇప్పటికే ఎందరో మంది వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి నుండి బయట పడటం నిజంగా ఒక యుద్ధంలాగే ఉంది. అయితే ఈరోజు కరోనా వైరస్ గోళ్ళ నుండి కూడా సోకుతుందా అనేది చూద్దాం.

సాధారణంగా మహిళలు పెద్ద పెద్ద గోర్లు పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎప్పటికప్పుడు గోర్లని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పెద్ద పెద్ద గోర్లు పెంచుకోవడం వల్ల సరిగ్గా మెయింటైన్ చేయకపోతే బ్యాక్టీరియా జబ్బులు అంటే డయేరియా లాంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

ఎందుకంటే పెద్ద పెద్ద గొర్ల లో ఎక్కువ మట్టి వంటివి చేరుతాయి. దీని ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎప్పుడూ కూడా గోళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలి. చిన్నగా ఉంచుకోవాలి.

శుభ్రంగా ఉండే గోర్లు నుండి కరోనా వస్తుందా…?

చాలా మంది పెద్ద పెద్ద గోర్లు పెంచుకుంటూ ఉంటారు అయితే వాళ్లలో అవగాహన లేకుండా చేతుల్ని శుభ్రంగా ఉంచుకునేటప్పుడు గోళ్ళను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ ఆలా చెయ్యరు. ఒకవేళ కనుక శుభ్రంగా ఉంచుకోక పోతే సీరియస్ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

శుభ్రత అనేది చాలా కఠినమైన విషయం. మనం తినేటప్పుడు గోళ్ళల్లో ఉండే క్రిములు కూడా నోట్లోకి వెళ్లి పోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే గోళ్ళను శుభ్రం చేసుకోవడానికి ఇక్కడ డాక్టర్ కొన్ని టిప్స్ చెప్పారు వాటిని కూడా చూద్దాం… మీరు చేతులు శుభ్రంగా కడుక్కుని ఆ తరువాత గొల్లని కూడా శుభ్రంగా కడుక్కోండి.

గోరువెచ్చని నీటితో సబ్బుని ఉపయోగించి చేతులు కడుక్కోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ కనుక మీకు గ్రీస్ వంటివి ఏమైనా పట్టుకోవలసి వస్తే అప్పుడు గ్లవుజులని వాడండి. దీనితో మీ గొర్ల కి అవి వెళ్లకుండా ఉంటాయి.

అలానే ఎప్పటికప్పుడు గోర్ల ని కట్ చేసుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతి సారి మీరు చేతులు కడుక్కుని వెంటనే ఆరపెట్టుకోండి. తడిగా చేతులు ఉండడం వల్ల క్రిములు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version