బెట్టింగ్ భూతం మరోసారి పంజా విసిరింది. బెట్టింగులు పెట్టి నష్టపోయానని ఓ వ్యక్తి చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీశాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం బంగారుపేటకు చెందిన తాపీ మేస్తీ సతీష్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది.
ఆన్‌లైన్ బెట్టింగ్‌తో నష్టపోయానని అందుకే తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు పేరుపాలెం బీచ్ వద్ద నుంచి తన తమ్ముడికి సెల్ఫీ వీడియో పంపించాడు. అందరూ తనను క్షమించాలని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. బాధితుడి తమ్ముడు ఫిర్యాదు ఆధారంగా కనిపించకుండా పోయిన వ్యక్తి కోసం మొగల్తూరు పోలీసులు గాలింపు చేపట్టారు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? ఏటైనా వెళ్లిపోయాడా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
https://twitter.com/ChotaNewsApp/status/1891343433551532507