యూట్యూబ్ లో అలాంటి వీడియోలను ఉచితంగా చూడలేరు?

-

యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఏదైనా మనకు తెలియనిది, తెలిసిన దానికి గురించి తెలుసుకొవాలంటే వెంటనే ఇందులో చూస్తారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా వివరంగా చెప్తారు.. అందుకే యూట్యూబ్ ఎక్కువ మంది క్రియేట్ చేసి మరీ జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే గూగుల్ వున్న వాళ్లు యూట్యూబ్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే గూగుల్ కొన్ని కొత్త రూల్స్ ను తీసుకువస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో విషయాలను మార్చినారు.

యూట్యూబ్‌ తన ఆదాయాన్ని మరింత పెంచుకునే క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే యూట్యూబ్‌ ప్రీమియం పేరుతో యూజర్లకు సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ తీసుకొచ్చిన విషం తెలిసిందే. డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి ప్రత్యేక కంటెంట్‌ను అందిస్తూ వస్తోన్న యూట్యూబ్‌ తాజాగా ఆదాయమార్గాన్ని పెంచుకునే దిశగా మరో అడుగు ముందుకేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఇకపై యూట్యూబ్‌లో 4కే రెజల్యూషన్‌ వీడియోలను చూడాలంటే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తప్పనిసరి చేసే ప్లాన్‌లో ఉందని సమాచారం. ప్రస్తుతం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా యూజర్లు ఎలాంటి యాడ్స్‌ లేకుండా వీడియోలు చూసే అవాకశం కల్పించిన విషయం తెలిసిందే. ఇందుకోసం నెలకు రూ.129, మూడు నెలలకు రూ. 399, సంవత్సరానికి 290 చెల్లించాల్సి ఉంటుంది..

ఇకపై 4కే వీడియోలను చూడాలంటే కచ్చితంగా ప్రీమియం చెల్చించే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. 4కే వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని తమకు నోటిఫికేషన్స్ వస్తున్నట్టు కొందరు యూజర్లు రెడిట్ ప్లాట్‌ఫాంలో పేర్కొనడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version