జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళా ఎస్సై మృతి చెందారు. జగిత్యాల జిల్లా డీసీఆర్‌బీలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కొక్కుల శ్వేత గొల్లపల్లి వైపు నుంచి జగిత్యాల వస్తుండగా.. చిల్వకోడూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్నద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి చెట్టును బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఎస్సై శ్వేతతో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మరో వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జగిత్యాల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.