ఏపీలోని ప్రకాశం జిల్లా కొమురోలు పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. అమరావతి-కడప రహదారి పక్కనే ఉన్న షాప్స్ నేమ్ బోర్డులు, విద్యుత్ స్తంభాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఫలితంగా విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.