కూలీలపైకి దూసుకెళ్లిన కారు.. గాల్లోకి ఎగిరిన వర్కర్స్.. సీసీ ఫుటేజ్ వైరల్!

-

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. డైలీ కూలీలు ఒక దగ్గర నిలబడి మాట్లాడుకుంటుండగా కారు ఒక్కసారిగా వారి మీదకు దూసుకొచ్చింది.ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. కూలీలపైకి కారు దూసుకెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చెరువు బజార్ వద్ద చోటుచేసుకుంది. అడ్డా కూలీలపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురికి గాయాలవ్వగా.. కారు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరిటాల భాస్కర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news