తిరుగులేని ‘ తిరుమ‌ల‌ ‘ విజ‌యం … 10, INTER లో రాష్ట్ర స్థాయిలో రికార్డులు…!

-

రాష్ట్ర విద్యారంగంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కాతేరు తిరుమ‌ల విద్యాసంస్థ‌లు మ‌రోసారి తిరుగులేని విజ‌యాలు న‌మోదు చేశాయి. ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఫ‌లితాల‌తో పాటు జేఈఈ మెయిన్స్‌లో సైతం అద్భుత విజ‌యంతో మ‌రోసారి తెలుగు రాష్ట్రాల‌లో త‌మ‌కు తిరుగులేద‌ని ఫ్రూవ్ చేసుకుంది. ఈ యేడాది ఎన్నో రికార్డులు తిరుమ‌ల ఖాతాలో ప‌డ్డాయి.

  • సీనియ‌ర్ ఇంట‌ర్ ఫ‌లితాల్లో సెన్షేష‌న‌ల్ విక్ట‌రీతో తిరుమ‌ల విజ‌య దుందుబి మోగించింది
  •  సీనియ‌ర్ ఇంట‌ర్ ఎంపీసీలో 1000కు 8 మంది విద్యార్థుల‌కు 991 మార్కులు రావ‌డం… ఓ ప్రైవేటు విద్యాసంస్థ‌ల చ‌రిత్ర‌లోనే అది కూడా ఒకే క్యాంప‌స్ నుంచి రికార్డుగా నిలిచింది. ఇక మ‌రో 26 మంది విద్యార్థులు 990 మార్కులు సాధించారు.
  •  జూనియ‌ర్ ఇంట‌ర్ ఎంపీసీలో 5 గురు విద్యార్థుల‌కు 470 మార్కుల‌కు గాను 467 మార్కులు సాధించారు. ఇక 46 మంది విద్యార్థులు 466 మార్కులు సాధించారు.
  •  జూనియ‌ర్ ఇంట‌ర్ బైపీసీలో 12 మంది విద్యార్థులు 440 మార్కుల‌కు 436 మార్కుల‌తో రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక మ‌రో 25 మంది విద్యార్థుల‌కు 435 మార్కులు వ‌చ్చాయి.
  •  సీనియ‌ర్ ఇంట‌ర్ ఎంపీసీ విభాగంలో 6920 మంది విద్యార్థులు ప‌రీక్షలు రాసి 99.50 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.
  •  ఒక్క జూనియ‌ర్ ఇంట‌ర్ ఎంపీసీ నుంచే తిరుమ‌ల విద్యార్థులు ఈ యేడాది 8100 మందికి పైగా ప‌రీక్ష‌లు రాసి 99 శాతం ఉత్తీర్ణ‌త సాధించారంటే తిరుమల సంస్థ‌ల ప్రభంజ‌నం ఎంత అప్ర‌తిహ‌తంగా సాగుతుందో అర్థం చేసుకోవ‌చ్చు.
  •  ఇక జూనియ‌ర్ ఇంట‌ర్ బైపీసీ విభాగంలో 884 మంది ప‌రీక్ష‌లు రాసి .. 99.9 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.
  •  ఇక 2025 JEE మెయిన్స్ విభాగంలో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్‌తో పాటు న‌లుగురు విద్యార్థులు 99.99 % సాధించారు. ఇది కాతేరు క్యాంప‌స్‌కు మాత్ర‌మే సాధ్య‌మైన రికార్డ్‌. అలాగే ఇదే మెయిన్స్ విభాగంలో 99.90 % 17 మంది విద్యార్థులు సాధిస్తే… మ‌రో 143 మంది విద్యార్థుల‌కు 99 % స్కోర్ వ‌చ్చింది. దాదాపు 1200 మంది విద్యార్థులు 90 % స్కోర్ చేశారు.
  •  గ‌త 2024లో IITలో దేశంలో వివిధ బ్రాంచ్‌ల‌లో తిరుమ‌ల విద్యార్థులు 302 సీట్లు సాధిస్తే.. NIT లో 410 సీట్లు సొంతం చేసుకున్నారు.
  •  2024 లో MBBSలో 250 సీట్లు సాధించారు.
  •  ఈ యేడాదితో క‌లుపుకుంటే ఇప్ప‌టి వ‌ర‌కు తిరుమ‌ల విద్యాసంస్థ‌ల నుంచి గ‌త కొన్నేళ్ల‌లో.. త‌క్కువ టైంలోనే 4000 వేల మంది విద్యార్థుల‌కు IIT – NIT – IIIT – BITS లో సీట్లు వ‌చ్చాయి.
  •  ఇక ఇప్ప‌టి వ‌ర‌కు తిరుమల మెయిన్ క్యాంప‌స్ కాతేరు నుంచే 1406 మంది విద్యార్థులు MBBS సీట్లు సాధించారు.

తిరుమ‌ల సిగ‌లో మ‌రో కొత్త బ్రాంచ్ :

గ‌త రికార్డుల‌తో పాటు ఈ 2025లోనే ఎన్నో రికార్డులు తెలుగు విద్యా చ‌రిత్ర‌లో లిఖించుకున్న తిరుమ‌ల విద్యాసంస్థ‌ల సిగ‌లో ఈ యేడాది నుంచి మ‌రో కొత్త బ్రాంచ్ కూడా ఏర్పాటు కానుంది. ఇప్ప‌టికే రాజ‌మహేంద్ర‌వ‌రం కాతేరు మెయిన్ క్యాంప‌స్‌తో పాటు విశాఖ‌ప‌ట్నం, భీమ‌వ‌రం బ్రాంచ్‌లు ఉండ‌గా.. గ‌తేడాది త‌ణుకు, పాయ‌క‌రావుపేట‌లో మ‌రో రెండు బ్రాంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ యేడాది కొత్త‌గా NH-16 ప‌క్క‌న పంగిడి – కాప‌వ‌రం జంక్ష‌న్ ద‌గ్గ‌ర కొత్త డే స్కాల‌ర్ బ్రాంచ్ భారీ ఎత్తున ఏర్పాటు కాబోతోంది. కొవ్వూరు, గోపాల‌పురం, తాళ్ల‌పూడి, చాగ‌ల్లు, దేవ‌ర‌ప‌ల్లి, కొయ్య‌ల‌గూడెం, నిడ‌ద‌వోలు మండ‌లాల ప్ర‌జ‌లు, విద్యార్థుల త‌ల్లిదండ్రుల విజ్ఞ‌ప్తి మేర‌కు ఈ కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news