బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తీరం దాటిన సంగతి తెలిసిందే. అయితే తీరం వెంట బలమైన గాలులు వీస్తున్న నేపధ్యంలో విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి ఓ భారీ కార్గో షిప్ కొట్టుకు వచ్చింది. బంగ్లాదేశ్ కు చెందిన మర్చంట్ వెసల్ కార్గో షిప్ ని ఔటర్ హార్బర్ లో నిలిపి ఉంచారు. కానీ భారీ ఈదురు గాలులకు యాంకరేజ్ తెగిపోయి కొట్టుకువచ్చింది.
గాలి తీవ్రత ఎక్కవగా వుండటంతో అది కొట్టుకుని వచ్చి పార్క్ సమీపంలోని రాళ్లలో చిక్కుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇసుక తిన్నుల మధ్య చిక్కుకోగా నౌకలో ఉన్న పదిహేను మంది సిబ్బంది సురక్షితంగా బయట పడ్డారు. యాంకర్లు రెండూ తెగిపోవడం వలనే ఇది కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న నేవీ అధికారులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.