ముడి పదార్థాల ధరలు పెరగడం, సెమికండక్టర్ల కొరత ఆటో మొబైల్స్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు కార్ బుక్ చేసుకుంటే దాదాపుగా నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ముడి పదార్ధాల కొరత కారణంగా కార్ల కంపెనీలు ధరలు పెంచుతున్నాయి. ఇప్పటికే టాటా, మారుతి సుజుకీ, హ్యుందాయ్ వంటి కంపెనీలు తమ కార్ల ధరలను పంచాయి.
తాజాగా మరో ఆటో మొబైల్ దిగ్గజం టొయోటా కూడా తమ కార్ల ధరలను పెంచుతున్నాయి. అర్బన్ క్రూయిజర్, ప్రీమియం హ్యాచ్ బ్యాక్ గ్లాంజా ధరలను పెంచింది. పెంచిన ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరగడంతో కంపెనీపై భారాన్ని తగ్గించుకునేందుకు కార్ల ధరలు పెంచాల్సి వస్తోందని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం అర్బన్ క్రూయిజర్ ధర రూ. 8.88-11.58 లక్షలు కాగా… గ్లాంజా ధర రూ. 6.39-9.96 లక్షల మధ్య ఉంది. కాగా… వీటి ధరలు ఎంత పెరుగుతుందనే విషయాన్ని టయోటా వెల్లడించలేదు.